చంద్రబాబు రిమాండ్ కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై పెద్దఎత్తున వాదనలు జరిగాయి. ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17 ఏ ప్రకారం అరెస్టు జరిగినప్పుడు గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్ధ్ లూథ్రాలు వాదనలు విన్పించగా, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. తీర్పు రిజర్వ్ చేశారు. రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు పిటీషన్‌పై తీర్పు వెలువడనుంది.