పార్వతీపురం సార్వత్రిక టీకా కార్యక్రమంలో నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన 13వ వార్డులో(బైపాస్ కాలనీ) వైద్య సిబ్బంది నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కార్డులు, ఆర్సిహెచ్ రికార్డులు, టీకా పొందుతున్న చిన్నారుల, గర్భిణీలు వివరాలతో పాటుగా సిబ్బందికి తగు సూచనలు చేశారు."
[zombify_post]