అవకాశాలను వినియోగించుకుని మంచిగా చదవాలి.. విద్యలో ఎదగాలి.. ప్రజలకు ఉపయోగపడాలి' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.అవకాశాలను వినియోగించుకుని మంచిగా చదవాలి.. విద్యలో ఎదగాలి.. ప్రజలకు ఉపయోగపడాలి' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. భవిష్యత్తులో వైద్య విద్యార్థులంతా నిపుణులుగా సేవలు అందించాలని, అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విజయనగరం వైద్య కళాశాల ప్రారంభోత్సవం చేసిన అనంతరం రాష్ట్రంలోని అయిదు వైద్య కళాశాలల విద్యార్థులతో ఇక్కడ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా
ప్రసంగించారు. 'ఈ కళాశాలల్లో మీరు నేర్చుకునే చదువు ద్వారా రాబోయే రోజుల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. గొప్ప వైద్యులుగా ఎదుగుతారని ఆకాంక్షిస్తున్నా. ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి రావాలన్నదే నా కోరిక.. విష్ యూ ఆల్ ది బెస్ట్' అని వారికి ఆశీస్సులు అందజేశారు. 'కొన్ని మాటలు నా మనసుకు ఎప్పుడూ తడుతుంటాయి. నాట్ ఆల్ ఏంజిల్స్ హేవ్ వింగ్స్, సమ్ హేవ్ స్టెతస్కోప్. కీప్ దిస్ ఇన్ మైండ్ అని ఇక్కడే రాసి సంతకం పెట్టా. మీ మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి. ఈ మాటలను మీరు గుర్తు పెట్టుకోండి.. దేశంలోనే మంచి వైద్యులుగా తయారవుతారని నా నమ్మకం..' అని విద్యార్థులకు హితబోధ చేశారు.
'రాష్ట్రంలో ఈ రోజు ప్రారంభించిన అయిదు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మున్ముందు వెనుకబడిన, గిరిజన ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి తీరుతాం. ఇదొక ఎత్తయితే వేల మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దే సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పుకోగలుతున్నాం. ఇప్పటి వరకు ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 4,735 సీట్లకు పెరుగుతాయి.
వీటితో పాటు అన్ని వైద్య కళాశాలల్లో వసతుల స్థాయిపెంచుకున్నాం. నర్సింగ్ కళాశాలను సైతం అభివృద్ధి చేస్తున్నాం. కొత్తగా వచ్చే నర్సింగ్ కళాశాలలతో 1,200 సీట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా సంఖ్య 2,290 సీట్లకు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న పాత వైద్య కళాశాలల అభివృద్ధికి రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నాం' అని సీఎం పేర్కొన్నారు.
[zombify_post]