AP CM YS Jagan to inaugurate 5 medical colleges today: అమరావతి :
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో 5 మెడికల్ కాలేజీల్లో అకడమిక్ తరగతుల ప్రారంభించనున్నట్టు ఏపీ సర్కారు తెలిపింది. ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నేడు విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి వర్చువల్ విధానంలో రంభించారు. పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె కేంద్రాలుగా మరో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. అలానే 2025-26 లో పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండ కేంద్రాలుగా మరో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్టు స్పష్టంచేసింది. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకొస్తూ సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయిగూడెం, దోర్నాల 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని ఏపీ సర్కారు తమ ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో తీసుకొచ్చామని ఏపీ సర్కారు వెల్లడించింది. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య నాలుగేళ్లలో 966 నుంచి 1,767 కు పెంచినట్టు తెలిపింది.