in , ,

మట్టి వినాయక ప్రతిమలనే పూజిదాం- నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

విశాఖపట్నం:  పర్యావరణ హితమైన వినాయక చవితి చేసుకోవాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమె ఎంవిపి రైతు బజార్ లో జీవీఎంసీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమలను రైతు బజార్ లోని రైతులకు, బజారుకు వచ్చే కస్టమర్లకు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, పార్లమెంటు సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ తో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నగర మేయర్ వెంకట కుమారి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే పిఓపి తో తయారుచేసిన వినాయక ప్రతిమలను వినియోగించరాదని నగర ప్రజలకు సూచించారు. రైతు బజార్లలో దాదాపు 2000 విగ్రహాలను పంపిణీ చేశామని తెలిపారు. అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముందుకు వచ్చి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయని తెలిపారు.
అనంతరం పార్లమెంటు సభ్యులు సత్మాయనారాయణ మట్లాడుతూ పిఓపి తో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని, జల కాలుష్యం వలన మత్స్య సంపద  తోపాటు మానవాళికి హాని కలుగుతుందన్నారు అందుకు అందరూ మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రాజెక్ట్ డైరెక్టర్  పాపి నాయుడు, ఏపిడి దుర్గాప్రసాద్, ఎంవిపి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

లారీ -బస్సు ఢీ: 20మందికి గాయాలు

pawan

పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జనసేన నాయకులు కందుల