in

ఘనంగా ఆలమూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం.

        

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్ గా యనమదల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అధ్యక్షత వహించిన చిర్ల మాట్లాడతూ మునిపెన్నడు లేని విధంగా మార్కెట్ కమిటీలో మహిళలకు రిజర్వేషన్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు గతంలో పెద్దగా నామినేటెడ్ పోస్టులు దక్కేవి కాదని తమ ప్రభుత్వ హయాంలో పక్కాగా అందరికీ దక్కుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ చేయని రీతిలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అమ్మబడి కింద విద్యార్థులు ఉన్న తల్లి పేరుతో నగదు జమ చేస్తున్నారని పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ముఖ్యమంత్రి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాడు అనడానికి యనమదల ఒక ఉదాహరణని అన్నారు. మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా గొల్లపల్లి డేవిడ్ రాజ్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాతి స్థానాలైన మార్కెట్ కమిటీ చైర్మన్లుగా రెడ్డి రవిదేవి చంటి, యణమదల నాగేశ్వరరావులను నియమించడం జరిగింది అని, మన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యులకు అందిన ఈ సముచిత స్థానాన్ని మీకు అందినట్టు భావించి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియచేశారు

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Kiran

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views
Popular Posts

టీడీపీ అత్యవసర సమావేశం

తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ చంద్రబాబు కొత్త స్లోగన్ : మంత్రి చెల్లుబోయిన వేణు