పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
హైదరాబాదు నుండి విజయవాడ వస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లాలోని గరికపాడువద్ద. పోలీసులు జిల్లాలకు ప్రవేశించకుండా అడ్డుకున్నారు.
రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని తెలిసి జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు భారీ ఎత్తున తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ కు అడ్డుగా ఉన్న పోలీసులను పక్కకు నెట్టడంతో జిల్లాలోకి ఐదు కిలోమీటర్ల దూరం పవన్ కళ్యాణ్ వాహనం ప్రవేశించింది అయితే పోలీసులు పవన్ జిల్లాలోకి ప్రవేశిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు కాగా ఏపీలోకి ప్రవేశించేందుకు వీసా పాస్పోర్ట్ లు ఏమైనా కావాలా అని పవన్ పోలీసులను ప్రశ్నించారు.
గరికపాడు చెక్పోస్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
[zombify_post]