in ,

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కేటీఆర్

ఈనెల 16వ తారీఖున జరిగే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర సచివాలయంలో సమీక్షించిన మంత్రి కేటీఆర్ హజరైన  మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వివిధ శాఖల అధిపతులు, పూర్వ జిల్లా కలెక్టర్లు
సమావేశంలో మంత్రి కే. తారక రామారావు కామెంట్స్
వలసల జిల్లాలో ఒకనాడు పడావుపడ్డ పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తుంది ఈ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుప్రతి ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది . కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుంది గోదావరిలో కాలేశ్వరం, కృష్ణాలో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టింది. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అవుతాయి
తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ గారి నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారత దేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉంటుంది ఈ ప్రాజెక్టుల నిర్మాణం వెనక 2001 నుంచి కన్న తెలంగాణ ప్రజల కల ఇది. ఉద్యమ కాలం నుంచి కెసిఆర్ గారి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు ఇది. పాలమూరు రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది అనేక అడ్డంకులను దాటుకుని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదలతో పూర్తయిన ప్రాజెక్టు ఇది రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుంది
16వ తేదీన జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఇంత గొప్ప సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలి
కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవం సభ ఉంటుంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఇతర విభాగాల అధిపతులతో కూలంకషంగా చర్చించిన మంత్రులు

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Bhanu

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

దళిత బంధు గ్రౌండింగ్ జరగకుండా ఓటు అడిగే హక్కులేదు- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కోటబొమ్మాలి లో వ్యక్తి మృతదేహం