*చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేసిన మంత్రి ఐకె రెడ్డి*
నిర్మల్ పట్టణంలో ప్రధాన కూడళ్లలో చిరువ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉచితంగా గొడుగులు పంపిణీ చేశారు. IKR ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో 1000 గొడుగుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.నిర్మల్ పట్టణంలో 600 వీధి వ్యాపారులకు, మండలాలలో 400 వ్యాపారులకు పంపిణీ చేస్తున్నారు. వర్షాల వల్ల రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకొంటున్న వారికి ఉపసమనం పొందేందుకు గొడుగులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రోజంతా ఎండనక, వాననక చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటున్న మహిళలు, వృద్దులకు తాత్కలిక నీడనివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్,fscs చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]