in ,

జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

అరుకు నియోజకవర్గం: ముంచంగిపుట్టు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న బోటనీ, మ్యాథ్స్‌ అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఐఈవో అప్పలస్వామి, ప్రిన్సిపాల్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.అభ్యర్థులు పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండి,అభ్యర్థుల బయోడేటాతో పాటు రెండు జతల ధ్రువపత్రాలు నకలను జత చేసి దరఖాస్తు పెట్టుకోవాలని,ముంచంగిపుట్టు కళాశాలలో ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. పాడేరులోని ఇంటర్‌ బోర్డు అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.

[zombify_post]

Report

What do you think?

అరిలోవలో ఘోర రోడ్డు ప్రమాదం

దళితబందు కొసం రోడ్డేక్కి ఆందోళన చేసిన మహిళలు.