ఈ భావి కోవెలకుంట్లలోని గుద్దేటిపేట లో మూలమ్మ దేవాలయం దగ్గర ఉన్నది. చాలా పురాతన చరిత్ర గల ఈ భావిలో రోజు మూలమ్మ రాత్రి మూడవ జాములో స్నానం చేయడానికి వస్తారని, ఈ విషయం 200 సంవత్సరం క్రితం అక్కడ ఉన్న బండేసా అనే ముస్లిం వ్యక్తి చూసినట్లు అక్కడివారు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ భావిలో ఎవరు పడినా మునిగిపోరని కూడా అక్కడి ప్రజల నమ్మకం. దానికి ఉదాహరణగా 180 సంవత్సరముల క్రితం గుద్దేటి అశ్వత్ రెడ్డి అనే వ్యక్తి వేకువజామున నీరు చేదుకుంటూ, పొరపాటున నీళ్లలో పడ్డాడని చాలామంది గజ ఈతగాళ్లు నీళ్లలో వెతికి చూశారని, కానీ ఏమీ లాభం లేదాని చెప్పారట. ఆ తర్వాత అరగంటకు అశ్వత్ రెడ్డి బయటికి రావడం, అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అశ్వత్త రెడ్డి గారు తేరుకున్నాక విషయం అడిగితే, తను కాలుజారే నీళ్లలో పడ్డానని, నీళ్లలో మునిగిన తర్వాత అక్కడ ఇద్దరు ఆడ గొంతుకలు ఇలా వినిపించాయని, వారిలో ఒకరైతే ఇతను నీళ్లలో మునిగిపోవాలని, ఇంకొకరు నా బావిలో ఎవరు మునిగిపోవడానికి వీలు లేదని చెప్పినట్టు, మాటలు వినిపించాయని అశ్వత్ రెడ్డి చెప్పారు. వారిలో ఒకరు గంగమ్మ తల్లి, అని ఇంకొక ఆవిడ మూలమ్మ దేవత అని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎంతమంది జారిపడిన ఎవరు చనిపోలేదని అక్కడి ప్రజలు చెబుతుంటారు.
[zombify_post]