తెల్లం అభ్యర్థిత్వంపై తిరుగుబాటు
ఐదు మండలాల అధ్యక్ష కార్యదర్శులు భేటీ
తెల్లంకు ఓటమి తప్పదనే సంకేతాలు
కేటీఆర్ ను కలవనున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ లో అసంతృప్తి రాజుకుంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లి తిరిగి 43 రోజుల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీ లో చేరిన డాక్టర్ తెల్లం వెంకటరావు కు సీయం కేసీఆర్ భద్రాచలం ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై ప్రకటన పై నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..
ఆ పార్టీకి చెందిన
ఐదు మండలాలకు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఈ విషయమై గుర్రుగా ఉన్నారు. శనివారం చర్ల మండల కేంద్రంలో ఐదు మండలాలకు చెందిన అద్యక్ష కార్యదర్శులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాజీ నియోజకవర్గ ఇంచార్జి మానె రామకృష్ణ, చర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, చర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, వాజేడు, వెంకటాపురం, చర్ల దుమ్ము గూడెం, భద్రాచలం మండలాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసే వారికి టికెట్ ఇవ్వాలని అందుకు అనుగుణంగానే అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరారు.మాజీ ఎమ్మల్సీ బాలసానిలక్ష్మీనారాయణ కు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎన్నికల అధికారిగా బాధ్యతలు ఇవ్వాలని కోరారు.నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బాలసానిలక్ష్మీనారాయణ అద్యక్షతన రెండు మూడు రోజుల్లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అన్ని విషయాలు కూలంకషం గా చర్చించి అనంతరం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.నియోజకవర్గ వర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగుర వేయుటకు అన్ని విధాలా కృషి చేస్తామని ప్రకటించారు
ఈ అత్యవసర సమావేశంలో భద్రాచలం మండల అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి రావు, కొండిశెట్టి. కృష్ణ మూర్తి, మాజీ అధ్యక్షుడు యశోద. నగేష్, అధికార ప్రతినిధి బల్ల. రాంబాబు, దుమ్ముగూడెం మండలం నుంచి అధికార ప్రతినిధి జానీ పాషా, చర్ల మండలం నుంచి అధ్యక్షుడు సోయం. రాజారావు, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, వెంకటాపురం మండలం నుంచి మండల అధ్యక్షుడు గంప. రాంబాబు లక్ష్మినారాయణ, అధికార ప్రతినిధి శివాజీ, వాజేడు మండలం నుంచి అధ్యక్షుడు పెనుమల్ల. రామకృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు..