in , ,

దళిత ఎస్సై ఆత్మహత్యపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

సూర్యాపేట జూలై 7:

చట్టాలు అమలు చేసే స్థానాల్లో ఉన్న పోలీసు శాఖలో కుల వివక్ష వేధింపులు ఉండటం వల్లే దళిత ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు.

ఆదివారం ఎం.వి.ఎన్ భవన్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ 25 రోజుల కిందటనే తను ఎదుర్కొన్న వివక్ష వేధింపులపై జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసిన పోలీసు ఉన్నతాధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే దళిత ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

 సీఐ జితేందర్ రెడ్డి కానిస్టేబుళ్లు కొందరు  వేధించిన తీరు వల్లే మనస్తాపానికి లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ సంఘటన పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు.పోలీసు శాఖలో జరుగుతున్న కుల వివక్ష,వేధింపులపై ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేశారు. చట్టాలు అమలు చేసే స్థానాల్లో ఉన్న పోలీసుల శాఖలోనే కుల  వివక్ష కొనసాగితే గ్రామ సీమల్లో సాధారణ దళితుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజురోజుకీ దళితుల పైన దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు.ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ప్రెస్స్మీట్ లో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, జిల్లానాయకులు సైదులు, సుధాకర్,నాగమణీ,దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

ఆదోని ఫర్టిలైజర్స్ షాపులలో 32 లక్షల అక్రమ నిల్వలను పట్టుకున్న

జిల్లాలో పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధుల