*ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించేతవరకు నూతన కాంప్లెక్స్ లను ఓపెన్ చేయనియ్యం*
రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ (RPSF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్.పి.ఎస్.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ……..ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించేతవరకు నూతన కాంప్లెక్స్ లను ఓపెన్ చేయనియ్యం అని అలాగే ఆదోని ఆర్ట్స్ కళాశాల భూములలో అక్రమ షాప్ లు నిర్మిస్తూ కళాశాల యాజమాన్యం షాపులను అద్దెకు ఇచ్చి జేబులను నింపుకుంటూ కళాశాల విద్యార్థులకు మైదాన స్థలాన్ని లేకుండా చేస్తున్నారని అన్నారు. షాప్ లు అద్దెకు ఇచ్చి,వచ్చిన అద్దె డబ్బులను ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి ఖర్చు పెడతామని ఇంతవరకు 800 మంది మహిళా విద్యార్థినులకు కేవలం ఐదు బాత్రూమ్ లు ఉండడం, కనీస వసతులు అయిన త్రాగు నీళ్లు లేకపోవడం అనేది చాలా సిగ్గు చేటని అలాగే విద్యార్థులు కళాశాల ఫీజులు,పరీక్ష ఫీజులు ఇలాంటివి కట్టలేనప్పుడు విద్యార్థుల నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు అంత శ్రద్ధ కళాశాల అభివృద్ధిలో ఎందుకు చూపియడం లేదు అని రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ (RPSF) నాయకులు డిమాండు చేశారు. కళాశాల మైదాన స్థలంలో అక్రమ షాపులను నిర్మించిన వారిపై చర్యలు తీసుకొని షాపులను కూల గొట్టి మళ్ళి యథావిధంగా కళాశాల ప్రహరీ గోడ నిర్మించి విద్యార్థుల మైదాన స్థలాన్నీ సంరక్షించాలని లేని ఎడల ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు,సబ్ కలెక్టర్ ఆఫీసు ముట్టడి ఇలా వరుస కార్యక్రమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.జిల్లా కార్యదర్శి బాలు, డివిజన్ నాయకులు దేవేంద్ర,తరుణ్, వినోద్, జయ, దాసు, వీరేశ్, రామలింగ, పవన్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!