ఆదోని అభివృద్ధి చెందాలంటే వైసిపి పోవాలి.. జనసేన పార్టీ మండల నాయకులు ఎం. పులిరాజు మాట్లాడుతూ…….. కడితోట గ్రామంలో మెయిన్ రోడ్ నుండి గ్రామంలోకి వచ్చే రహదారికి ఉన్న విద్యుత్ స్తంభాలకు లైట్లు వేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. చీకటిలో ప్రమాదాలు జరగకుండా విష పురుగుల పాడిన ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని ఆలోచించి మా జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్పన్నగారు 2018లో ఆయన దృష్టికి తీసుకు వెళ్తే ఆయన సొంత నిధులతో స్తంభాలు లైట్లు వేయించడం జరిగింది. మరి అప్పటినుండి మరమ్మత్తులు చేయడంలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మరమ్మత్తులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నాము. ఈ ప్రభుత్వానికి అలా సాధ్యం కాదు అని ప్రకటన చేస్తే జన సైనికులం తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం చందాలు వేసుకొని ఈ లైట్లు మరమ్మత్తులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేస్తున్నాము. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆదోని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!