ఆదోని మున్సిపాలిటీ 23వ వార్డు లో వై నీడ్ జగన్ ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే శ్రీ వై సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 23వ వార్డు ఇంచార్జ్ మాధవరెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బోయ శాంతమ్మ, జెసియస్ టౌన్ కన్వీనర్ వెల్లాల. మధుసూదనశర్మ, మార్కెట్ యార్డు చైర్మన్ మజార్ అహ్మద్,ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు, ఈ సందర్భంగా చైర్మన్ శాంతమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ మజార్ అహ్మద్,మధుసూదనశర్మ మాట్లాడుతూ…………. రాష్ట్రములో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అమ్మ ఒడి,,వసతి దీవన, పొదుపు మహిళలకు ఋణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా, జగనన్న ఆసరా, జగనన్న గోరుముద్ద, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని శాంతమ్మ, మధుసూదనశర్మ, మార్కెట్ యార్డు చైర్మన్ మజార్ అహ్మద్ తెలిపారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి పట్టాలు,డిట్కో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇల్ల పంపిణీ కూడా దాదాపు పూర్తి చేసారని, పేదబడుగు బలహీన వర్గాలకు, బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధికి, పేదవాడి కుటుబాల అభివృద్ధి మీ అందరి సహాయ సహకారాలు రాబోయే ఎన్నికల్లో ఆదోనిలో సాయిప్రసాద్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని వారు కోరారు. అనంతరం వార్డు వెల్ఫేర్ వార్డు అడ్మిన్ పాములేటి, 23 వార్డుకు సంక్షేమ పథకాల ద్వారా అందిన వివరాలను వివరించి, సంక్షేమ పథక వివరాలతో కూడిన బోర్డును, చైర్మన్ శాంతమ్మ, వార్డు ఇంచార్జి మాధవరెడ్డి, టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదనశర్మ తో కలిసి ఆవిష్కరణ చేసారు.అనంతరం చైర్మన్ శ్రీమతి బోయ శాంతమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ నరశింహులు,కౌన్సిలర్లు చలపతి వైఎస్సార్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వీరభద్రారెడ్డి, వెంకప్ప, రఘు, మస్తాన్, రాఘవ రెడ్డి మొదలైన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!