in ,

తిరుపతిలో మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు..చోరీకి గురైన 2230ఫోన్లు

*తిరుపతిలో మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు.. చోరీకి గురైన 2230 ఫోన్లు రికవరీ*

తిరుప‌తి, డిసెంబర్‌ 1: తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం రూ.1.08 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసింది. మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా భారీగా మొబైల్ ఫోన్ రికవరీ చేసింది. గత 2 నెలల వ్యవధి లో 600 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు ఇప్పటి దాకా 7 విడతల్లో చోరీకి గురైన రూ.4.01 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్ రికవరీ చేసింది. CEIR సిటిజన్ పోర్టల్ ద్వారా మొబైల్ పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్లలో ఉన్న సమాచారం కూడా దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాక్ అవుతుందని పోలీసు యంత్రాంగం పేర్కొంది. మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు 6 విడతల్లో 1630 సెల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించామన్న తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఇప్పటిదాకా మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా రూ. 2.93 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ చేశామన్నారు. ఇప్పుడు 7 విడతలో రూ.1.08 కోట్ల విలువైన 600 సెల్ ఫోన్స్ రికవరీ చేసామన్నారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం 7విడతల్లో రూ. 4.01 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ చేసామని ఎస్పీ అన్నారు. స్థానికులే కాకుండా తిరుపతి కొచ్చే యాత్రికులు కూడా మొబైల్ హంట్, వాట్సాప్ సర్వీసులను, CIER పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు.

మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు సత్ఫలితాలను ఇవ్వడంతో భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. CEIR (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సేవలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. CEIR CITIZEN PORTAL ద్వారా మొబైల్ పోయిన వెంటనే పోర్టల్ లో ఫిర్యాదు చేస్తే చాలన్నారు. సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాక్ అవుతుందని ఎస్పీ అన్నారు. అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతూ ఉందని జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి అన్నారు.  తిరుపతి జిల్లాలో సెల్ ఫోను పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా MOBIEL HUNT WHATSAPP NO 9490617873 అప్లికేషన్ సేవల ద్వారా వాట్సప్ కు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందచేస్తున్నామన్నారు.

ఎవరైనా మొబైల్ ఫోన్ పోతే పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసిన MOBIEL HUNT 9490617873 నెంబర్ కు WhatsApp లో Hai లేదా HELP అని మెసేజ్ చేస్తే వచ్చే linkలో D. 1 CEIR (Central Equipment Identity Register) పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం కూడా దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాకు అవుతుందన్నారు. అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలపై తిరుపతి జిల్లా ఎస్సీ పరమేశ్వర రెడ్డి పర్యవేక్షణలో తిరుపతి సైబర్ క్రైమ్ వింగ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పోగొట్టుకున్న మొబైల్స్ ను రికవరీ చేసి భాదితులకు అంద చేసింది.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

ఆదోని మున్సిపాలిటీ 17 వై వార్డు లో వై నీడ్ జగన్ ఆంధ్రప్రదేశ్

ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మిచౌంగ్’ తుఫాన్.. భారీ వర్ష సూచన..