దొంగను పట్టుకున్న సీఐ విక్రమ సింహ..
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే నెలలో సిరిగుప్ప చెక్ పోస్ట్ వద్ద ఐరన్ షాపు మరియు పంజర్ పోల్ ఆంజనేయ స్వామి గుడి హుండీ దొంగతనాల కేసులో ముద్దాయి నరసింహులును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1 లక్ష 20 వేలు నగదు, స్వామివారి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారుపోలీసులు. వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాబడిన సమాచారం మేరకు బాలకొలను గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బోయ గేరి కి చెందిన నరసింహులు S/o బోయ యువరాజు పట్టుకుని విచారించగా మే నెల లో సిరిగుప్ప చెక్ పోస్ట్ వద్ద గల ఇమ్రాన్ ఐరన్ షాపులో రు.1,20,000/- దొంగతనం చేసినట్టుగా మరియు జూన్ నెలలో పంజర పోల్ లోని ఆంజనేయస్వామి గుడి లోని హుండీ పగులగొట్టి 6000/- లు స్వామి వారి 15 తులాల వెండి ఛాతీ కవచం, కన్నులు, పాదాలు ను దొంగతనం చేసినట్టుగా అంగీకరించడం తో అతని వద్ద ఉన్న స్వామి వారి వెండి వస్తువులు మరియు 1,10,000/- నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించినట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో 1 టౌన్ CI విక్రమసింహ, సిబ్బంది HC మద్దిలేటి, రంగస్వామి,లక్ష్మణ, సుధీర్ , ముస్తాక్, అశోక్ లు పాల్గొన్నారు….
This post was created with our nice and easy submission form. Create your post!