జీవీఎం పరిధి 92 వ వార్డులో బుధవారం ఉదయం జీవీఎంసీ కో ఆప్షన్స్ సభ్యులు బెహరా భాస్కర రావు గారి ఆధ్వర్యంలో 1) సాయి సంపత్ పాఠశాల నుంచి భాస్కర్ వరాహ టింబర్ డిపో వరకు సిసి డ్రైన్స్, కల్వర్టు నిర్మాణానికి 10.57 లక్షలతో, 2) మేఘాద్రి గెడ్డ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ రిపైర్స్, పెయింటింగ్స్ కు 3.82 లక్షలతో,
3) ఎస్సీ బీసీ కాలనీలో సిసి రోడ్స్, డ్రైన్స్ మరమ్మత్తులు నిమిత్తం 5 లక్షలతో,
4) అజంతా పార్కు కాలనీలో అజంతా పార్క్ కాంపౌండ్ వాల్ మరమ్మతులకు 5 లక్షలతో,
5)అజంతా పార్క్ కాలనీలో బీటీ రోడ్డు నిర్మాణానికి 7 లక్షలతో,
6) ఎస్సీ బీసీ కాలనీలో సిసి రోడ్స్ ,సీసీ డ్రైన్స్ నిర్మాణానికి 12 లక్షలతో,
7) ఉడా కాలనీలో సిసి రహదారులు, సిసి డ్రైన్స్ నిర్మాణానికి 18 లక్షలతో .
8) ఎస్సీ బీసీ కాలనీలో ఫ్లోరింగ్, సిసి,రహదారులు, సిసి డ్రైన్స్, బావి చుట్టూ గ్రిల్స్ నిర్మాణానికి 18 లక్షలతో,
9) మేఘాద్రి గెడ్డ ప్రాంతంలోని చర్చి దరి సిసి రహదారులు సీసీ కల్వర్టులు నిర్మాణానికి 19 లక్షలతో మొత్తం 98.39 లక్షలతో అభివృద్ధి పనులకు ఎస్సీ బీసీ కాలనీ వినాయక టెంపుల్ దగ్గర శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా 91 వ వార్డు 1) బాజీ జంక్షన్ నుంచి గవర వీధి వరకు సిసి డ్రైన్స్ నిర్మాణానికి 19.65 లక్షలతో,
2) పైడిమాంబ టెంపుల్ నుంచి జయప్రకాష్ నగర్ వరకు సిసి డ్రైన్స్ నిర్మాణానికి 5. 20 లక్షలతో,
3) రామకృష్ణ నగర్ లో సీసీ రోడ్స్, సిసి డ్రైన్స్, సిసి మెట్లు నిర్మాణానికి 19.80 లక్షలతో, 4) రామకృష్ణ నగర్ లోని కమ్యూనిటీ హాల్ దగ్గర సిసి రోడ్స్, డ్రైన్స్ నిర్మాణానికి 19.10 లక్షలతో మొత్తం 63.75 లక్షలతో బాజీ జంక్షన్ వద్ద శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా1) పాత గోపాలపట్నంలో సిసి రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి 19.95 లక్షలతో,
2) పాత గోపాల పట్టణంలో డ్రైన్స్ నిర్మాణానికి 19.55 లక్షలతో,
3) పాత గోపాలపట్నంలో డ్రైన్స్ నిర్మాణానికి 19.95 లక్షలతో, 4) పాత గోపాలపట్నంలో డ్రైన్స్ నిర్మాణానికి 19.75 లక్షలతో మొత్తం 79.20 లక్షలు తో శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడజరుగుతుందన్నారు…నియోజకవర్గంలో ఇప్పటికే కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు.
నియోజకవర్గంలో ఏ వార్డులో కూడా సమస్య ఉందని ఇకపై నా దృష్టికి రాకూడదనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందన్నారు.,.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనపై రాజీ పడే ఉద్దేశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 91వ వార్డు అధ్యక్షులు గుని శెట్టి శ్రీనివాస్ రావు గారు, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు గారు, జే సి ఎస్ మండల ఇన్చార్జి గేదెల మురళీకృష్ణ గారు , 90 వ వార్డ్ అధ్యక్షులు నమ్మి శ్రీను గారు , పాత గోపాలపట్నం రాజుగారు, శంకర్ గారు, అధికారులు, సచివాల సిబ్బంది, వాలంటీర్లు , గృహ సారధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
## శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, చైర్మన్, విశాఖ డెయిరి మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMSMEDC) మరియు సమన్వయకర్త, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ##
This post was created with our nice and easy submission form. Create your post!