in ,

ఈనెల15ప్రజారక్షణభేరి చలో విజయవాడ సందర్భంగా భారీ ప్రజా బహిరంగ సభ

*నవంబర్ 15 ప్రజారక్షణభేరి చలో విజయవాడ సందర్భంగా జరుగు భారీ ప్రజా బహిరంగ సభ.   CPM…ఆదోని….*

            లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజారక్షణభేరి రాష్ట్ర బస్సు జాత ముగింపు సందర్భంగా నవంబర్ 15న  విజయవాడలో జరుగు భారీ ప్రజా బహిరంగ సభను జయప్రదం కోరుతూ సీపీఎం కార్యాలయం (సుందరయ్య భవన్) నందు వాల్ పోస్టర్స్ (గోడపత్రిక)లను *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, ముక్కన్న, పట్టణ నాయకులు నాగరాజు, వెంకటేష్, విడుదల చేశారు*.

          కార్యక్రమం ఉద్దేశించి వీరు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మన లందరినీ కలవరపరుస్తున్నాయని  వారు తెలిపారు. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూసే కన్నా  రాష్ట్ర భవిష్యత్తును సక్రమ మార్గాన్ని నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన కాలం వచ్చిందని, ఈ ఉద్యమంలో సిపిఎం పార్టీ మీతో పాటు ఉంటుందని వారు తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తి కావస్తుంది. అప్పుడు మనకు అరచేతిల స్వర్గం చూపించారు. కేంద్రంలోని బిజెపి నాయకులు ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, కడప ఉక్కు, రైల్వే జోన్ వంటి విభజన హామీలలో ఏ ఒక్కటి అమలు కాలేదని వారు తెలిపారు. రాష్ట్ర ప్రజల్ని నిలువున మోసం చేసిన బిజెపి అంతటితో ఆగకుండా మన రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును తెగ నమ్మడానికి తయారయిందని వారు అన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రజలపై బారాలు వేస్తుందని వారు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నిరసనను కూడా తెలియజేయడానికి వీలు లేకుండా నిర్బంధాలు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని వారు తెలిపారు. కావున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ప్రజా ప్రణాళిక వివరిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు జాతలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. రాష్ట్ర బస్సు జాతలు  ముగింపు సందర్భంగా నవంబర్ 15న విజయవాడలో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

కాంగ్రెస్ నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు.

మాదిగల విశ్వరూపం మహాసభకు ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు.