*ఆదోని మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి తక్షణమే కరువు సాయక చర్యలు చేపట్టాలని కోరుతూ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో*
తక్షణమే ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు తక్షణమే ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని, కోరుతూ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కుప్పగల్ క్రాస్, సిరుగుప్ప క్రాస్, సంతకుడ్లూరు దగ్గర రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ ఈ సంవత్సరం తీవ్రమైన వర్షాభావం పరిస్థితుల వల్ల కరువు ఏర్పడిందని కరువు మండలాలుగా ప్రకటించడంలో ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆదోని మండలాన్ని కరువు మండలంగా చేయాలని, కోరారు. ఇప్పుడు డిసెంబర్ జనవరిలో వెళ్లాల్సిన వలసలు సెప్టెంబర్ నుంచి ప్రారంభమైనాయని వెంటనే ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం మండల అధ్యక్షులు కే శేఖర్, సిఐటియు మండల అధ్యక్షులు జే రామాంజనేయులు, కెవిపిఎస్ మండల కార్యదర్శి బి తిక్కప్ప, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!