» ఇదే వైసీపీ ప్రభుత్వ దమన నీతి » ఓటమి భయంతోనే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు,వేధింపులు» ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
»» కోటబొమ్మాళితెలుగుదేశంపార్టీ నాయకులు
ఓటమి భయంతోనే సీఎం జగన్, మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కోటబొమ్మాళి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. మంగళవారం కోటబొమ్మాళి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ – వ్యవస్థల్ని మేనేజ్ చేసి,ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారనీ, ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరుగుతోందని అన్నారు. జగన్పై 6 వేల కోట్ల అక్రమాస్తుల కేసులు విచారణ దశలో ఉండగా, బెయిల్పై వచ్చి నిర్భయంగా ముఖ్యమంత్రి పీఠంపై కూచున్నాడని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరస్తులు బయట తిరుగుతుండగా, నిరపరాధులు జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే, జగన్ కేసులు ప్రయోగించి, ప్రతిపక్షాలను భయభ్రాంతులను చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి, శిమ్మనారాయణ, కర్రి అప్పారావు, దేవాది సింహాద్ర మ్మ, వాన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!