గురు న్యూస్ విశాఖపట్నం : విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి జగదాంబ జంక్షన్ నుండి టర్నర్ చౌల్ట్రీ వరకు ఫుట్ పాత్ ను నమ్ముకొని కొన్ని వందలమంది నేటికి 30సంవత్సరాలనుండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.గత 11రోజుల క్రితం పోలీస్ ట్రాఫిక్ అధికారులు ఫుట్ పాత్ హాకర్స్ దగ్గరకు వచ్చి వ్యాపారాలు నిలిపి వేయాలనీ ఆదేశించగా వారు భయాందోళలనకు గురై ఎమ్మెల్యే వాసుపల్లి గారిని సంప్రదించడం జరిగింది. ఆయన వెంటనే మానవతా దృక్పధం తో స్పందించి పోలీస్ ట్రాఫిక్ అధికారులు ఎస్ఐ, సిఐ, ఏసీపీ & ఏడీసీపీ లతో మాట్లాడగా వారి వద్దనుండి ఎటువంటి స్పందన రాని కారణంగా, వ్యాపారాలు లేక రోడ్డు పడ్డ వారి బ్రతుకులకు మరల వ్యాపారం చేసుకునేలా దారి చూపాలని సదుద్దేశ్యం తో 30వార్డ్ కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం & వైస్సార్సీపీ నాయకులు ప్రొద్భలంతో జగదాంబ జంక్షన్ లో ధర్నా చేయగా వెంటనే పోలీస్ ట్రాఫిక్ అధికారులు స్పందించి వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతించగా ధర్నా విరమించరు వాసుపల్లి.ఈ సందర్బంగా ఫుట్ పాత్ హాకర్స్ మాట్లాడుతూ పేదల ప్రభుత్వం సుపరిపాలన లో వారికి న్యాయం జరిగినందుకు వైస్సార్సీపీ కి రుణపడి ఉంటామని, మరల రాబోయే 2024ఎలక్షన్ లో సీఎం గా జగన్ మోహన్ రెడ్డి గారిని, విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే గా వాసుపల్లి గణేష్ కుమార్ గారిని గెలిపించి వారి బ్రతుకులు బాగుచేసే దిశగా అనేక సంక్షేమ పధకాలు, అభివృద్ధి పనులు చేసేందుకు వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తామని కృతజ్ఞతలు తెల్పుతూ… జై జగన్… జై వైసీపీ… జై వాసుపల్లి అని కేరింతలతో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ అధికారులు చిరు వ్యాపారుల పొట్టకోట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, అధికార పక్షంలో ఉన్నా తప్పును ఒప్పుకోమని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. గత 11రోజులుగా జగదాంబ లక్కీ షాపింగ్ మాల్ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకునే వారిని ట్రాఫిక్ పోలీసులు, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అడ్డుకొని వ్యాపారాలు చెయ్యనివ్వక పోవడం పై ఎమ్మెల్యే వాసుపల్లి మండిపడ్డారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ కొండమ్మ, మండల అధ్యక్షుడు పీతల వాసు, కర్రి నీలకంఠం, డైరెక్టర్ ప్రసాద్, పెంటపల్లి సత్యనారాయణ, ఆడివిష్ణు, లండా రమణ, లింగం శ్రీను, ఎర్రబిల్లి ప్రభాకర్, మాదబత్తుల రమేష్, బొడ్డేటి ప్రసాద్, వడ్డాది దిలీప్, కొరిపిళ్లి ఆనంద్, రామలక్ష్మి, ఇతర వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!