గురు న్యూస్ విశాఖపట్నం : గాజువాకలో గల మండి రెస్టారెంట్లో భోజనం చేసిన యువకులు మొత్తం 13 మంది అస్వస్థకు గురయ్యారు వారిలో 9 మంది సోమవారం డిశ్చార్జ్ అయ్యారు , మిగిలిన 4 నలుగురు యువకులు మల్కాపూర్ (St.Anns hospital)సెంటెన్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారు పరామర్శించారు . అలాగే వారి కుటుంబ సభ్యుల తో మాట్లాడి ధైర్యం చెప్పారు. హాస్పిటల్ డాక్టర్స్ అడిగి తెలుసుకుని మీరు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తర్వాత స్థానిక ఎమ్మార్వో (MRO) గారితో ములగడ గ్రామము లో బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా గణబాబు మాట్లాడుతూ,హోటల్స్ నందు దొరికే ఆహారానికి సంబంధించి సమగ్ర భద్రత కల్పించాల్సిన బాధ్యత GVMC పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ది అని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా మామూళ్ల వసూళ్ల మీద పెట్టిన శ్రద్ధ ప్రజల మీద పెడితే ఈ దుస్తితి రాదు, అని ఆయన అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!