in , ,

అమ్మో.. డెంగ్యూ!

జిల్లాలో జ్వరాల పంజా విసురుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడాలేకుండా జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.

*రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

ప్రైవేట్ ల్యాబ్లో దోపిడీ

– కానరాని ‘ఫ్యామిలీ డాక్టర్’

-నెల రోజుల కిందట రాజాం మునిసిపాల్టీలోని – మెంటిపేట ఎస్సీకాలనీకి చెందిన ముద్దాడ బాలరాజు అనే యువకుడు డెంగ్యూ లక్షణాలతో మృతిచెందాడు. జ్వరం బారినపడిన బాలరాజు రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పదిరోజుల పాటు చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.

– రాజాంలోని తలచింతలకు చెందిన గూడేన సూర్యకళ అనే యువతికి జ్వరం తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆమెకు డెంగ్యూగా నిర్ధారణ అయింది. ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో జ్వరపీడితులు ఉన్నారు. తలచింతలలో పారిశుధ్యం లోపించింది. కాలువల్లో చెత్త, పూడిక పేరుకుపోయి దోమలకు ఆవాసంగా మారుతోంది. దీంతో జ్వరాలు ప్రబలుతున్నాయి.

రాజాం/విజయనగరం,  జిల్లాలో జ్వరాల పంజా విసురుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడాలేకుండా జ్వరాలు జిల్లాలో జ్వరాల పంజా విసురుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడాలేకుండా జ్వరా ప్రబలుతున్నాయి. దీంతో రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో రక్తకణాలు తగ్గుతుండడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. విజయనగరం జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రి, 7 సామాజిక ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లాలో ఏదో ఒకచోట జ్వరాలతో పాటు డెంగ్యూ కేసులు వెలుగుచూస్తున్నాయి. సాధారణంగా జూలై నుంచి అక్టోబరు వరకు వైద్య ఆరోగ్య శాఖ డేంజర్ జోన్ పరిగణిస్తుంది. ఏటా జూలైలో డెంగ్యూ నియంత్రణ మాసోత్సవాలను నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని, కేవలం ఒకటి అరా డెంగ్యూ, మలేరియా కేసులను చూపి చేతులు దులుపుకొన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా విజయనగరం, రాజాం, బొబ్బిలి మునిసిపాల్టీలతో పాటు చీపురుపల్లి, గజపతినగరం, ఎస్.కోట, కొత్తవలస తదితర ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.

ల్యాబ్ ఇష్టారాజ్యం

జిల్లా వ్యాప్తంగా 200 వరకు ల్యాబ్లు ఉన్నాయి. ఇందులో కొన్నింటికే వైద్యఆరోగ్య శాఖ అనుమతులు ఉన్నాయి. ఒక్క విజయనగరంలోనే 100 వరకు ఉన్నాయి. అయితే, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే రోగులను వివిధ పరీక్షల పేరిట సిబ్బంది దోచుకుంటున్నారు. ఈ పరీక్షలను కూడా ఆస్పత్రులకు చెందిన ల్యాబ్లోనే చేయించాలి. బయట చేస్తామంటే కుదరదు. ఒక్క రక్త పరీక్షకే రూ.700 నుంచి రూ.2,200 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ఎంత అడిగితే అంత ఇచ్చుకోవాల్సిందేనని, లేదంటే ఇబ్బందులు పెడతారని రోగులు చెబుతున్నారు.అంతా ర్యాపిడ్ టెస్టులే..

క్రీడలు

= చిత్రజో

ప్రతి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా రోగులకు 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 74 ర వ్యాధులకు ఉచితంగా మందులు అందిస్తా మని ప్రకటించింది. ప్రతీ గ్రామంలో మొబైల్ అంబులెన్స్ వాహనాల ద్వారా నెలకు రెండుసార్లు సేవలు అందిస్తామని గొప్పలు చెప్పింది. కానీ, క్షేత్రస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కనిపించడం లేదు. నెలలో ఒక పూట గ్రామాలకు వచ్చి వైద్య పరీక్షలు చేసి మమ అనిపించేస్తున్నారు. అది కూడా ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తుండడంతో వ్యాధి నిర్ధారణ సక్రమంగా జరగడం లేదు. ఈసీజీ, హిమోగ్లోబిన్, గర్భ నిర్ధారణ యూరిన్ టెస్ట్, ర్యాండమ్ గ్లూకోజ్, మలేరియా, హెచ్ఐవీ, డెంగ్యూ, మల్టీ పారా యూరిన్, అయోడిన్, హైపాటిసిస్ బి, పైలేరియా, సిప్లిన్ ర్యాపిడ్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నా ఏవీ పూర్తిస్థాయిలో నిర్ధారించలేకపోతున్నారు. దీంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్లకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగ

ల్యాబ్లకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా ల్యాబ్ నిర్వాహకులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరముంది.

ఫలితం లేని ‘సురక్ష’

జగనన్న సురక్ష పేరుతో ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ, ఎప్పటిలాగే ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, తదితర బాధితులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి, సామాజిక ఆసుపత్రులకు వస్తున్నారు. మరి జగనన్న ఆరోగ్య సురక్ష ఫలితం ఏమిటో అర్థం కావడం లేదు. మరోకప్క చాలా గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ఇంటింటా చెత్త సేకరణ తూతూమంత్రంగా సాగుతోంది. సేకరించిన చెత్త డంపింగ్ యార్డులకు వెళ్లడం లేదు. చెత్త సంపద కేంద్రాలు వినియోగంలో లేవు. దీంతో గ్రామాల్లో సేకరించిన చెత్త రహదారుల చెంతన పారబోస్తున్నార

దీంతో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయి.

సక్రమంగా సేవలు అందిస్తున్నాం

జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయి. అన్ని ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరిచాం. నాడు – నేడు పథకం ద్వారా అన్నిరకాల సౌకర్యాలు కల్పించాం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నాం. ఎక్కడైనా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

-డి.భాస్కరరావు డీఎంహెచ్, విజయనగరం

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

18 బస్తాలు పీడీఎఫ్ బియ్యం పట్టివేత

ఆటో, బైకు ఢీ”