చంద్రబాబుకు ఊరూవాడా బాసటగా నిలుస్తోంది. మేమున్నామంటూ దీక్షలు కొనసాగిస్తున్నారు. విజయనగరంలో అశోక్ బంగ్లా వద్ద దీక్షలు చేస్తున్న శ్రేణులకు పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు మద్దతు తెలిపారు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: చంద్రబాబుకు ఊరూవాడా బాసటగా నిలుస్తోంది. మేమున్నామంటూ దీక్షలు కొనసాగిస్తున్నారు. విజయనగరంలో అశోక్ బంగ్లా వద్ద దీక్షలు చేస్తున్న శ్రేణులకు పొలిట్జ్బ్బ్యరో సభ్యుడు పూసపాటి అశోకగజపతిరాజు మద్దతు తెలిపారు. తెలు యువత ద్విచక్ర వాహనాలపై ప్లకార్డులతో తిరిగారు.
మక్కువ, న్యూస్టుడే: రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడిన చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మక్కువ మండలం మార్కొండపుట్టిలో శ్రేణులతో కలసి రిలే దీక్షలు చేపట్టారు. అంతకు ముందు వీధుల్లో వైకాపా వైఖరిని నిరసిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు.
: స్కిల్ డెవలప్మెంట్లో అవినీతిజరగలేదని తేటతెల్లమవుతోందని తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలోని దీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెదేపా హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రం పేరును మార్చడం ఏమిటని ప్రశ్నించారు.
శృంగవరపుకోట, న్యూస్టుడే: ఎస్. కోటలో రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలోని శిబిరంలో వెంకటరమణ పేటకు | చెందిన పార్టీ శ్రేణులు పాల్గొని వినూత్నంగా నిరసన తెలిపాయి. జైలు గదిలో ఊచల వెనుక ఉన్నట్లు సెట్టింగు వెనుక తెలుగు మహిళలు, నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు.
గజపతినగరం: తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబును విడుదల చేయాలని.. లేకుంటే రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అభిమానులను జైల్లో పెట్టాలంటూ చంద్రబాబు మాస్కులు, చేతులకు నల్లరిబ్బన్లు అరదండాలుగా వేసుకుని జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.
బొబ్బిలి, న్యూస్టుడే: బొబ్బిలిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి బేబినాయన పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!