పట్టాల పక్కనుంచి నడిచి వెళుతున్న ఓ వ్యక్తి రైలు వేగానికి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
బొబ్బిలి గ్రామీణం, న్యూస్టుడే: పట్టాల పక్కనుంచి నడిచి వెళుతున్న ఓ వ్యక్తి రైలు వేగానికి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన మండలంలో జరిగింది. ఎస్సై సత్యనారాయణ వివరాల ప్రకారం.. పెంట గ్రామానికి చెందిన గుల్ల తిరపతి (40) శుక్రవారం సమీపంలో ఉన్న పట్టాల పక్క నుంచి పొలానికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఈక్రమంలో రైలు వచ్చింది. ఆ వేగానికి తుళ్లిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
This post was created with our nice and easy submission form. Create your post!