అనకాపల్లి(మాడుగుల), అక్టోబర్ 4: దేశ విదేశాలలో అరకు కాఫీకి ప్రాచుర్యం కల్పించడం ద్వారా కాఫీ రైతులకు పరిశ్రమ ద్వారా మరి కొంతమందికి ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి “నేటివ్ అరకు కాఫీ” పేరుతో కాఫీ తయారీ లఘు పరిశ్రమకు వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. మాడుగుల ఎండిఓ కార్యాలయం లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఉపముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తదితరులు హాజరయ్యారు. అనంతరం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో నేరుగా వినియోగదారుల గడప వద్దకే అరకు కాఫీ బ్రాండ్‌ను పంపించడం ద్వారా అరకు కాఫీకి డిమాండ్ సృష్టించే లక్ష్యంతో లఘు పరిశ్రమను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రూ 20 కోట్లతో కోటవురట్ల మండలం కొడవటిపూడి లో ఏర్పాటు చేయబోయే ఈ పరిశ్రమ ద్వారా సుమారు వెయ్యి మంది కాఫీ రైతులు, 200 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన ఆర్గానిక్ కాఫీ పౌడరు, గింజలు ప్రాసెసింగ్ చేస్తారన్నారు. ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి 13 యూనిట్లను ఒక ఎం ఓ యు చేశారని చెప్పారు వీటిలో 3 యూనిట్ లను ప్రారంభించగా 9 యూనిట్లకు భూమి పూజ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీధర్, తాసిల్దార్ ఎం వి రత్నం, ఎంపీపీ వి. ధనుంజయ్, జడ్పిటిసి కిముడు రమణమ్మ, మాడుగుల సర్పంచ్ ఎడ్ల కళావతి తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
