డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. కీలకమైన ఏపీ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యునిగా
అమలాపురానికి చెందిన వైసిపి సీనియర్ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు నియమితులయ్యారు.
ఈ కమిటీ చైర్మన్ గా గ్రంధి శ్రీనివాస్ వ్యవహారస్తుండగా డైరెక్టర్లుగా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు డైరెక్టర్లు గా వున్న కమిటీ లో చెల్లుబోయినను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు సంస్థలను ఈ కమిటీ మానిటరింగ్ చేస్తుంది. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా గ్రంధి శ్రీనివాస్, డైరెక్టర్స్ శాసన సభ్యులు పెండెం దొరబాబు, అన్నా రాంబాబు, రవీంద్రనాధ్ రెడ్డి, కిలారి వెంకట రోశయ్య, జి. శ్రీనివాసులు, ధనలక్ష్మీ, జోగారావు, పి. జి. వి. ఆర్ నాయుడు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, బి. తిరుమల నాయుడు లు వున్నారు. చెల్లుబోయిన కు పదవి రావడంతో అమలాపురం లో అభిమానులు ఆనంద డోలికల్లో తేలియాడారు. భారీ బాణా సంచా కాల్చి అభిమానం చాటుకున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!