in ,

పక్కాగా ఓటరు జాబితా సవరణ

పాడేరు అక్టోబర్ 3: ఓటరు జాబితా సవరణ-2024 కార్యక్రమం జిల్లాలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. మంగళవారం విజయవాడ  ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం – 2024, రాజకీయ పార్టీలు సమర్పించిన క్లెయిమ్‌లు ,అభ్యంతరాలు, మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్, బదిలీ చేయబడినఓటర్లు, నకిలీ ఓటర్ల జాబితాల వెరిఫికేషన్ , ఎపిక్ కార్డ్ జనరేషన్, తదితర అంశాలపై  జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెండు సార్లు నమోదు కాబడిన వాటిని గుర్తించి ఒక పేరును ఓటర్ జాబితా నుండి  తొలగించాలని ఆయన సూచించారు.జిల్లాలో ఎన్నికల జాబితా సవరణ 2024 ప్రగతిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. ఫారం 6, ఫారం 7. ఫారం 8 సేకరణలపై వివరించారు. డూప్లికేట్ ఓట్లు, మృతి చెందిన ఓటర్లు ను తొలగింపు పక్కగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫారం 7 పెండెన్సీ 10.4 శాతం, ఫారం 8 పెండెన్సీ 5.07 శాతం ఉందని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, డిఆర్ఓ పి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం : #హోంమంత్రి తానేటి వనిత

గొలుగొండ మండలంలో వరుస దొంగతనాలు