*
– వెరిఫైకాని లింక్‌లపై క్లిక్ చెయ్యడం ద్వారా గానీ, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే యాప్స్ ను ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవద్దు
– మీ బ్యాంకు ఖాతాల సమాచారం, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్, యూపీఐ పిన్, ఓటీపీ, సీవీవీ వంటి వివరాలు ఎవరితోను షేర్ చేయకండి
– ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్
మీ క్రెడిట్ కార్డుపై చార్జెస్ పడతాయని లేదా బ్లాక్ అవుతుందని చెప్తూ వచ్చే ఫోన్ కాల్స్, లింక్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఇటీవల ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కల్గి ఉన్న మద్దిపాడు మండలంకు చెందిన ఒక వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఒక నెంబర్ నుండి ఫోన్ చేసి మీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు చార్జెస్ పడతాయని, ఆ చార్జెస్ పడకుండా ఉండుటకు అతని వాట్సప్ నెంబర్ కు “ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఏపీకే” యాప్ పంపించి అది అతని ఫోన్లో డౌన్లోడ్ చేయించి అతని ఫోన్ హ్యాక్ చేసి, అతని కార్డు డీటెయిల్స్ ను నమోదు చేయాలని చెప్పి ఆ డీటెయిల్స్ ను నమోదు చేసిన వెంటనే అతని క్రెడిట్ కార్డు నుండి రూ. 98,000 కట్ అయ్యి మోసపోయాడని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ తెలియజేసారు.
This post was created with our nice and easy submission form. Create your post!