ఈరోజు అసెంబ్లీ ఆవరణంలో గౌరవ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని* “మూలపేట పోర్టు ఆర్ అండ్ ఆర్ కమిటీ” సభ్యులను గౌరవ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారి ఆద్వర్యం లో కలవటం జరిగింది…మూలపేట పో ర్టు నిర్మాణం కొరకు త్యాగ మూర్తులుగా నిలిచిన నిర్వాసిత గ్రామ ప్రజలు యొక్క ఎన్నో సమస్యలు ఇదివరకు తీర్చగా మిగిలిన పలు సమస్యలలో
1.ప్రస్తుతం కేటాయించిన మూలపేట పోర్టు నిర్వాహితులు యొక్క ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉప్పు నీరు పడిన కారణంగా ఆ నీరు తాగుటకు ఉపయోగకరం కాదు కావున ప్రత్యూమ్నాయం కల్పించుట కొరకు…..
2.మూలపేట మరియు విష్ణుచక్రం నిర్వాహిత గ్రామాల నుండి 18 మందికి వివిధ కారణాలు వలన ఇప్పటి వరకు పిడిఎఫ్ ప్యాకేజ్ నష్టపరిహారం అందలేదు కావున తక్షణమే అందజేయుట కొరకు…
3.18 సంవత్సరాల వయస్సు గల యువతకు స్పెషల్ పిడిఎఫ్ ప్యాకేజ్ 5 లక్షల వరకు ఇప్పించవలసిందిగా మనవి
4.యువత పిడిఎఫ్ ప్యాకేజ్ ప్రస్తుత తేదీ ప్రకారం కాకుండా ముఖ్యమంత్రి గారు పోర్టు శంకుస్థాపన చేసిన తేదీ లేదా భూసేకరణ ఒప్పుకున్న తేదీ ప్రకారం ఇవ్వాలని మనవి…
5.పోర్టు నిర్మాణం అయ్యాక ప్రతి రేషన్ కార్డుకు ఒక శాశ్వత ఉద్యోగం ఇస్తామని అధికార హామీ కావాలని..
6.ప్రతి నిర్వాహిత కుటుంబానికి శాశ్వత ఉద్యోగం కొరకు ఉద్యోగ అవకాశం కోసం ఎంప్లాయిమెంట్-ఆర్ నెంబర్ కలిగిన కార్డును ఇప్పించాలని..
7. గ్రామకంఠం భూములకు సర్వే జరిపించి అనుభవంలో ఉన్న నిర్వాహితులకు ఆర్ అండ్ ఆర్ నష్టపరిహారం అందించాలని..
8.నిర్మాహితుల గృహ నిర్మాణం వ్యయం కోసం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేయగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు పై సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలపగా…ఆర్ అండ్ ఆర్ కమిటీ సభ్యులు జీరు. బుకింగ్ దొర(శివ రెడ్డి)గారు, కోత. దాలయ్య గారు, దారపు. అప్పలరెడ్డి గారు, జీరు. శ్యామసుందరరావు గారు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు…
*… MLC టెక్కలి…*
This post was created with our nice and easy submission form. Create your post!