పాడేరు, సెప్టెంబర్ 29:-వార్షిక రుణ ప్రణాళిక మేరకు రైతులకు శత శాత౦ రుణాలు మంజూర్ చేయాల్సిందేనని సంయుక్త కలెక్టర్ జే. శివ శ్రీనివాసు బ్యాంకర్లకు స్పష్టం చేసారు. శుక్రవారం డుంబ్రిగుడ నుండి వర్చువల్ గా బ్యాంకర్ల త్రైమాసిక సమీక్ష సమావేశంలో పాల్గొన్న జేసి మాట్లాడుతూ, వ్యవసాయానికి కేటాయించిన రూ.1279 కొట్లలో ఇప్పటి వరకు 40 శాతం రుణాలు మంజూరు చేసారని, వ్యవసాయ అనుబంధ సంస్థలకు టర్మ్ లోన్ల కింద రూ.184 కోట్ల రుణాలకు 48.69శాతం మంజూరు చేసారని చెప్పారు. ఈ సందర్భంగా జేసి వ్యవసాయ రుణాలను శాత శాతం పూర్తి చేయాలని ఆదేశిస్తూ కవులు రైతులకు కూడా రుణాలు మంజూరు చేయాల్సిందేనని స్పష్టం చేసారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.2174 కోట్ల రుణ లక్ష్యం కాగా ఇప్పటివరకూ కేవలం 27.32 శాతం మాత్రమె మంజూరయ్యాని, అప్రాదాన్యతా రంగాలకు కొంత మెరుగుగా 42.44 శాతం మంజూరు చేసారని తెలిపారు. అదేవిధంగా ఎంఎస్ఎంఇ రంగంలో కూడా రుణాలు మంజూరు చేసి పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ త్రైమాసిక సమీక్షలో హైదరాబాద్ నుండి రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధి అబ్దుల్ రెహమాన్, జిల్లా ప్రధాన కేంద్రం నుండి యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ పి. నరేష్, నాబార్డ్ డిడిఎం జి.ఆర్. శమంత కుమార్, ఎల్ డి ఎం. ఎన్ రేఅవితేజ, వ్యవసాయ, పారిశ్రామిక సహాయ సంచాలకులు విజయ కుమార్, నవీన్ కుమార్, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
