కులగణన సాహసోపేత నిర్ణయం. ~ వైఎస్సార్ జిల్లా కార్యదర్శి… వెల్లాల.మధుసూధనశర్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శ్రీకృష్ణ కమిటీ కులగణనతో పాటుగా రాష్ట్రములో వివిధ అంశాలపైన అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం వలన రాష్ట్రములో జనాభా పరముగా అధిక సంఖ్యలో ఉండి అణగారిన అగ్రవర్ణ పేదలకు కులగణన చేయడము వలన రాజకీయ పార్టీల దృష్టిలో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉందని మధుసూదనశర్మ అన్నారు.కులగణన జరగక దాదాపుగా 100సంవత్సరాలు పైబడిందని తద్వారా ఆర్థికంగా సామాజికంగా అగ్రవర్ణాలు వెనుకబడి ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని మధుసూదనశర్మ ఆవేదన వ్యక్తం చేశారు.ఇటువంటి సమయములో సమర్థవంతమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సరియైన నిర్ణయం తీసుకుని శ్రీ కృష్ణ కమిటీ నివేదికను అమలు చేయాలని సంకల్పం చేసుకుని రాష్ట్రములో అగ్రవర్ణ పేదరిక నిర్మూలనకు మరో ముందడుగు వేసారని తద్వారా రాజకీయ ఆర్థిక సామాజికంగా విద్య , వైధ్య వంటి వివిధ ప్రాధాన్యత అంశాల్లో అగ్రవర్ణ పేదలకు సంపూర్ణ న్యాయం జరగబోతోందని మధుసూదనశర్మ సంతోషం వ్యక్తం చేశారు.నిత్యం ప్రజల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉంటూ, ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను ప్రజల మధ్యన ఉండేలా చూసి ప్రజల సమస్యలు గమనించినప్పుడే ఏం ముఖ్యమంత్రి అయిన ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని అటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమని మధుసూదనశర్మ సంతోషం వ్యక్తం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!