• పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ కోసం ప్రతిపాదనలు
• సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ఆదోని న్యూస్ :- లోపాలు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహ కరించాలని ఆదోని నియోజకవర్గ అధికారి, సబ్ కలె క్టర్ అభిషేక్ కుమార్ కోరారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రాత్రి 7 గంటల సమ యంలో ఓటరు జాబితాపై రాజకీయ పార్టీలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు. జాబితా ప్రక్షాళనకు రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరించాలన్నారు. ప్రస్తుతం ఆదోని నియోజకవ ర్గంలో 256 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటిలో 24 పోలింగ్ స్టేషన్లకు సదుపాయాలు సరిగా లేనందు వల్ల కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, హాజరైన అధికారులు వచ్చాయన్నారు. 24 పోలింగ్ స్టేషన్లకు లోకేషన్ మార్పునకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల మార్పునకు సంబంధించి ఏవైనా సూచనలు ఉంటే తెలియజేయవచ్చని, ఈఆర్వోలు పరిశీలించి తగిన నివేదికలు ఇస్తారని సబ్ కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. పోలిం గ్ స్టేషన్లు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాల్లో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలింగ్ స్టేషన్లలో ర్యాంపు, టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్, విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుం టామన్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్లోల్లో ఎలక్షన్ సూపర్వైజర్లు, బీఎల్స్పె షల్ సమ్మర్ రివిజన్, పోలింగ్ స్టేషన్ హేతుబద్ధీకర ణలో భాగంగా ఒక కుటుంబం ఒకే పోలింగ్ స్టేషను ఓటు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూపర్వై జర్లకు, బీఎల్ ఓలకు సబ్ కలెక్టర్ సూచించారు. తహ సీల్దార్ వెంకటలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్లు రజనీకాం తిరెడ్డి, ఎజాజ్ అహ్మద్, మున్సిపల్ అసిస్టెంట్ కమిష ఓలకు నర్ అనుపమ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!