ఆదోని న్యూస్ :- ఆదోని మున్సిపల్ కౌన్సిల్ రూ.3కోట్లతో చేపట్టబోయే 46 అభివృద్ధి పనులకు ఏకగ్రీ వంగా ఆమోదం తెలిపింది. ఆదోని అభివృద్ధే లక్ష్యం గా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, చైర్పర్సన్ శాంత, అధికార యంత్రాంగంతో పాటు పాలకవర్గం ముం దుకెళ్తుంది. బుధవారం చైర్పర్సన్ బోయ శాంత అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో సమావేశం జరిగింది. మున్సిపల్ జనరల్ ఫండ్స్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.3 కోట్లతో చేపట్టబోయే అభి వృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదంకోసం అజెండాను ప్రవేశపెట్టారు. పాలకవర్గ సభ్యులు ఆమోద ముద్ర వేశారు. ప్రతి వార్డు, సందు, వీధి, గల్లీ గల్లీన అభివృ ద్ది పనులు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తాగు నీటి వసతి, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పాలకవర్గ సభ్యులు అధికారులకు సహకారం అందించారు. అజెండాలో ప్రవేశపెట్టిన 49 అంశాలలో మూడు శానిటేషన్ సెక్షన్‌కు సంబం ధించినవి కాగా, మిగతా 46 అభివృద్ధి పనులకు సం బంధించినవి. మొత్తం 49 అంశాలకు ఆమోదం తెలపడంతో అభివృద్ధి మరింతగా జరగనుంది. బసాపురం ఎస్ఎస్ ట్యాంకు మెయింటెనెన్స్‌కు నిధులు కేటాయించాలని కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి, బాలాజీయాదవ్, సురేష్ అధికారులను కోరగా జన రల్ ఫండ్స్‌ను కేటాయిస్తామని కమిషనర్ రఘునాథ్ రెడ్డి సమాధానమిచ్చారు. 1వ వార్డు వాల్మీకి నగర్లో డ్రైనేజీలు, రోడ్లు నిర్మించాలని సభ్యురాలు పార్వతి కమిషనర్‌కు సమస్యలను వివరిస్తున్న కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి, అధికారుల అధికంగా నెలకోసారి ఉన్నాయని, ఫాగింగ్ చేయాలని కోరారు. రెవెన్యూ, అంగన్వాడీ తదితర శాఖల అధి సభ్యులు కోరారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ రూ.20 లక్షలు కేటాయించారని మళ్లీ రూ.18 కేటాయించడంపై ఆరా తీయాలని రఘునాథ్ బాలాజీ అధికారులను కోరారు. గతంలో చేసిన సిగ్నల్స్ పనిచేయడం లేదని, రోడ్లపై దిష్టిబొమ్మల్లా వేలాడుతున్నాయని చెప్పారు. పట్ట 250-300 దాకా చేతిపంపులు, మినీ వాటర్ ఉన్నాయని, వాటి మెయింటెనెన్స్ లేక రంధ్రాలు పడి నీరంతా లీకేజీలు అయ్యి కాలువల్లోకి ప్రవహిస్తున్నాయని అధికా మురుగు రుల దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే దోమలు లించి వారం, పది రోజుల్లోగా సమస్యను పరిష్క రిస్తామని వాటర్ వర్క్స్ ఏఈ రాజశేఖర్ రెడ్డి సభ్యు జరిగే కౌన్సిల్ మీటింగ్‌కు విద్యుత్. లకు సమాధానంగా చెప్పారు. తాగునీటి సరఫరా తెల్లవారుజామున 3, 4 గంటలకు తాగునీరు సర తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకో ఫరా చేస్తున్నారని ఉదయం 5 లేదా 6 గంటలకు సరఫరా చేయాలని బాలాజీ అధికారులను కోరగా సానుకూలంగా స్పందించారు. 22వ తేదీన జరిగిన వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, అం దుకు సహకరించిన మున్సిపల్, శానిటరీ సెక్షన్ అధి కారులు, సిబ్బంది, పోలీసులు, విద్యుత్‌శాఖ, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులకు పాలకవర్గం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది. సమావేశం లో వైస్ చైర్మన్లు గౌస్, నరసింహులు, ఎంఈ రవి, డీఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మెప్మా ప్రాజెక్టు అధికారిణి షనాభాను, ఎలక్ట్రికల్, టీపీఓ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!