*దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు..!*
*ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..!*
*కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి..!*
* కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ..
👉 జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారు, జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు గారి ఆదేశాల ప్రకారం..
ఆలూరు నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆలూరు మండల అధ్యక్షులు తుంబలబీడు లక్ష్మన్న గారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు…ఈ సందర్భంగా చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ…….కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, 2024 వ సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరులో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరెయాలని గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఆలూరు నియోజకవర్గంలో అక్టోబర్ 18న ప్రవేశించి సంవత్సరం పూర్తి కావస్తున్నా సందర్బంగా సంఘీభావంగా హత్ సే హత్ జొడో అభియాన్ (చేయి చేయి కలుపుదాం) కార్యక్రమం పున ప్రారంభించి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఆంధ్రప్రదేశ్ కు సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ గారు మెుదటి సంతకం చేస్తారని రైతులుకు 3 లక్షల రైతు రుణాలు మాఫీ మరియు 500/- రూ కే గ్యాస్ సిలిండర్ మరియు నిరుపేద కుటుంబాలకు ప్రతినెల 6000/- రూపాయిలు సహాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం పల్లి రామాంజనేయులు, ఉపాధ్యక్షులు ఈరన్న, ప్రధాన కార్యదర్శి వర కుమార్, ఆలూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉరుకుందప్ప, హలహర్వి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గూల్యం విజయ్ కుమార్, చిప్పగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఖాజీపురం రాంబాబు, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, కరెంటు గోవిందు, పద్మ ఆర్ట్స్ చంద్ర, చిప్పగిరి వినోద్ కుమార్, నవీన్, వినిత్, శివ, కోటి, అమరేష్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!