in ,

గిరి పిల్లల భవిష్యత్తుపై ప్రత్యెక దృష్టి పెట్టండి

గిరి పిల్లల భవిష్యత్తుపై ప్రత్యెక దృష్టి సారించాలని డి. మోదాపుట్టు గిరిజన సంక్షేమ బాలురు ఉన్నత పాటశాల ఉపాధ్యాయులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.  మంగళవారం జగనన్న సురక్ష వైద్య శిబిరం ప్రారంభంలో భాగంగా ఆ పాటశాలను పరిశీలించిన  కలెక్టర్ అక్కడ సుపాయలపై ఆరా తీసారు.  పాటశాలకు కిచెన్ చిన్నదిగా ఉన్నందున భోజనాలకు ఇబ్బంది పడుతున్నామని, కిచెన్ ను ఆనుకుని ఉన్న స్థలంలో షెడ్ ఏర్పాటు చేస్తే పిల్లల భోజనంకు వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదని కలెక్టర్ దృష్టికి ఉపాధ్యాయులు తీసుకు వచ్చారు.  అదే విధంగా మరుగుదొడ్లు ఉన్నప్పటికీ రన్నింగ్ వాటర్ లేనందున ఇబ్బందిగా ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించుకుని ఖర్చైన బిల్లును ఎటి డబ్ల్యుఓ ద్వారా అందజేస్తే ఖర్చును సంబంధిత వ్యక్తికీ చెల్లిస్తానని హామీ ఇచ్చారు.  అదేవిధంగా డైనింగ్ రూమ్ షెడ్ కు పంచాయతి రాజ్ సహాయ ఇంజినీర్ ద్వారా అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపిస్తే తగు చర్య తీసుకుంటానని హామీ ఇవ్వటంతో ఉపాధ్యాయులు సంతోషంతో కలెక్టర్ ను అభినందించారు.

ఈ కార్యక్రమాలలో జగనన్న సురక్ష రాష్ట్ర నోడల్ అధికారి డా. రమేష్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డా. సి. జమాల్ బాషా, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. కృష్ణా రావు, టిబి నియంత్రణాదికారి డా. విశ్వేశ్వర నాయుడు, డి.ఎల్.డి.ఓ, ఎ.టి.డబ్ల్యు.ఓ రజని, స్థానిక సర్పంచ్ ఎల్. చిట్టిబాబు, ఎంపిటిసి కే. నరసింహ మూర్తి, ఎ.ఎం.సి చైర్మన్ కే. సూరిబాబు, ఎ.ఎం.సి డైరెక్టర్ జి రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

న్యాయదేవతా చంద్రబాబుకు న్యాయం చెయ్యి…

ఎన్ఆర్ఇజిఎస్ వేతన దారులకు పని కల్పించండి