in ,

29న ఐదో విడత వైఎస్సార్ వాహన మిత్ర ప్రారంభించనున్న సీఎం జగన్

    ఈ నెల 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయి   వైఎస్సార్ వాహన మిత్ర పథకం  కార్యక్రమానికి హాజరు కానున్న దృష్ట్యా    అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసి సిద్ధం చేయాలని రాష్ట్ర హోం మంత్రి వర్యులు, జిల్లా ఇంచార్జి మంత్రి తానేటి వనిత అన్నారు.     ముఖ్యమంత్రి కార్యక్రమాల శాసన మండలి సభ్యులు, సమన్వయ కర్త తలశిల రఘురాం,  జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29 శుక్రవారం నగరంలోని విద్యాధరపురం షాదీఖానాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత  లబ్ధిదారులకు నగదు జమ చేసే కార్యక్రమానికి చేపడుతున్న ఏర్పాట్లపై నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర హోమ్ మంత్రి వర్యులు, జిల్లా ఇంచార్జి మంత్రి తానేటి వనిత  శాసన మండలి సభ్యులు తలశిల రఘురాం, రుహుల్లా,  రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు వర్ధన్, శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు,  జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలతో సమావేశం నిర్వహించారు.   ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకు చెందిన  సుమారు 15,065 మంది లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారన్నారు.   ప్రోటోకాల్ ప్రకారం  ప్రధాన  వేదికపై సిట్టింగ్ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు.  ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకునే మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి వివరాలతో   రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.  లబ్ధిదారులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖికి సిద్ధపరచాలని   రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.  జిల్లా నలుమూలల నుండి లబ్ధిదారులు ముందుగానే  సభ కార్యక్రమానికి చేసుకునేలా ఏర్పట్లు చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశించారు.   స్వయం సహాయక సంఘాలు, ఆటో, టాక్సీ యూనియన్ అసోసియేషన్ నాయకులు,  సభ్యులతో  సమన్వయం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు.  రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా అర్హులైన టాక్సీ, ఆటో డ్రైవర్లు, యజమానులకు ప్రతి ఏటా రూ.10వేలు ఆర్థిక సహాయం  అందిస్తుందని  ఈ సందర్బంగా రాష్ట్ర హోం మంత్రి వర్యులు, జిల్లా ఇంచార్జి మంత్రి తానేటి వనిత తెలిపారు.

    ఈ  సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్  దేవినేని అవినాష్,   జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్, డిసిపి విశాల్ గున్ని,  డిటిసి పురేంద్ర, కనక దుర్గ ఆలయ ట్రస్ట్  బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఇంచార్జి డిఆర్వో  వెంకటేశ్వర్లు  ఉన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

టిడిపి సామూహిక నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన రాజోలు జనసేన

రిలే నిరాహార దీక్షలు… చర్ల సీపీఐ’