సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 30వేల ఇళ్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు అన్నింటినీ పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామని చెప్పారు. మూసారాంబాగ్ వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
40 వేల ఇళ్లు పంపిణీ: మంత్రి కేటీఆర్

