స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఉన్న చంద్రబాబు ను సీబీఐ అధికారులు కాసేపట్లో న్యాయమూర్తి ముందుకు ప్రవేశపెట్టనునచనారు. ఈ కేసు విచారణ లో భాగంగా రెండు రోజుల పాటు సీబీఐ అధికారులు చంద్రబాబు ను రాజమండ్రి సెంట్రల్ జైలు లో విచారించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో విచారణ పూర్తి అయింది. దీంతో పాటు సీబీఐ కోర్టు విధించిన రెండు రోజుల కస్టడీ కూడా పూర్తయింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు ను ఏసీబీ న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఏసీబీ న్యాయమూర్తి చంద్రబాబు కు బెయిల్ మంజూరు చేస్తారు లేక రిమాండ్ ను పొడిగిస్తారా అన్న సందిగ్ధ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!