in

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోటే విద్యుత్ రంగంలో విజయాలు:

హైదరాబాద్ కేంద్రం నుండి..

  • 50 వేల కోట్లతో ట్రాన్స్ మిషన్&డిస్ట్రిబ్యూషన్.

  • మారుమూల గ్రామాలకు సరిపడా విద్యుత్ సరఫరా.

  • 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాలో తెలంగాణ రికార్డ్.

  • ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోటే విద్యుత్ రంగంలో విజయాలు.

  • 18,567 మేఘావాట్లకు పెరిగిన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం.

  • అందుకు యాజమాన్యాలు,సిబ్బంది శ్రమ అమోఘం.

గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ పై ఒత్తిడి వలదు.

  • పవర్ గ్రిడ్ తో సంబంధం లేకుండా సరఫరా ఉండదు.

  • రాత్రి పూట సరఫరాలో ఇబ్బందులు ఉత్పన్నమవుతాయి

  • –మంత్రి జగదీష్ రెడ్డి

===============ఎఫ్. టి.సి.సి.ఐ ఆధ్వర్యంలో రెడ్ హిల్స్ ఫెడరేషన్ హౌజ్ లో పారిశ్రామిక వేత్తల ఇంటారాక్టివ్ సెషన్

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి,పాల్గొన్న ప్రభుత్వ ప్రత్యేక ఇంధన శాఖా కార్యదర్శి సునీల్ శర్మ తదితరులు

===============

50 వేల కోట్లతో రాష్ట్రంలో విద్యుద్దీకరణ జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.తద్వారా 2014 తరువాత యావత్ భారత దేశంలోనే విద్యుత్ సరఫరా లో తెలంగాణా రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఫెడరేషన్ హౌస్ లో ఎఫ్.టి.సి.సి.ఐ ఆధ్వర్యంలో జరిగిన పారిశ్రామిక వేత్తల ఇంటారాక్టివ్ సెషన్ కు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంధన శాఖా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్న ఈ సెషన్ కు ఎఫ్ టి సి సి ఐ అధ్యక్షుడు ప్రారంభోపన్యాసం చేశారు.అనంతరం తెలంగాణా రాష్ట్రం-ఇంధన రంగంలో భవిష్యత్ సవాళ్లు అన్న అంశంపై మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 50 వేల కోట్లతో ట్రాన్స్ మిషన్ ,డిస్ట్రిబ్యూషన్ లు అభివృద్ధి పరచడం వల్లనే ఈ రోజు పారిశ్రామిక వేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత విద్యుత్ సంస్థల యాజామాన్యాలు,సిబ్బంది కృషి ఉందని ఆయన తేల్చిచెప్పారు.2014 కు ముందు పారిశ్రామిక వేత్తలు ఎంత ధర అయినా చెల్లించి విద్యుత్ ను కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు అందుకు భిన్నంగా ఉంది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ మహిమనేనని ఆయన కొనియాడారు. అయితే అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ పై ఒత్తిడి తెవొద్దని ఆయన పారిశ్రామిక వేత్తలకు సూచించారు. గ్రిడ్ తో నిమిత్తం లేకుండా అందులో రాత్రుళ్ళు విద్యుత్ సరఫరా అసంభవం అని ఆయన స్పష్టం చేశారు.ప్రభుత్వానికున్న సామాజిక బాధ్యతలు దృష్ట్యా ఇది ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ఆయన తెలిపారు.ఈ సెషన్ లో పాల్గొన్న సుమారు 150 మంది పారిశ్రామిక వేత్తలు గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సిస్ పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని కోరగా మంత్రి జగదీష్ రెడ్డి సున్నితంగా తిరస్కరిస్తూ ఈ విషయంలో వత్తిడి వలదని సరిపడా విద్యుత్ సరఫరా కు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

గడువు తేదిలోగా CMR చెల్లింపులు పూర్తి చేయాలి

రైతులకు రుణమాఫీ లబ్ది జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు-జిల్లా కలెక్ట