జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే వారం రోజుల్లోగా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. .ఉద్యోగ వర్గాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ గ్యారెంటెడ్ పెన్షన్ పథకం జిపిఎస్ విషయంలో ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది.
ఉద్యోగులు ఎంతగా గోల చేస్తున్నప్పటికీ, వారి అభ్యంతరాలను ఖాతరు చేయకుండా జగన్ క్యాబినెట్ జిపిఎస్ బిల్లుకు ఆమోదం తెలిపింది. బుధవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలలోనే ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందే అవకాశం కూడా ఉంది. తమతో సుదీర్ఘకాలం చర్చలు జరిపినప్పటికీ, తమ అభ్యంతరాలు నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై.. ఉద్యోగ వర్గాలు భగ్గుమంటున్నాయి.