అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేరుస్తూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులు చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరారు. దానిపై విచారణ ఈ రోజు రానుంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నిన్న ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాడీ వేడీ వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పును ఈ రోజు కు వాయిదా వేశారు. సెప్టెంబరు 21వ తేదీ ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడనుంది. , అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సెప్టెంబరు 21 హైకోర్టులో విచారణ జరగబోతోన్న సంగతి తెలిసిందే.