Senior Actor Naresh: సీనియర్ హీరో నరేష్ అందరికీ సుపరిచితుడే. మూడో భార్య రమ్య రఘుపతి తో విడాకులు తీసుకున్న తర్వాత.. పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. తల్లి విజయనిర్మల చనిపోయిన తర్వాత.. నరేష్ తల్లడిల్లుపోవడం జరిగింది. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు ఇంకా పలు వివాదాలతో సతమతమవుతున్న సమయంలో పవిత్ర లోకేష్ తో కలిసిన తర్వాత నరేష్ తన జీవితంలో సంతోషాన్ని చూడడం జరిగిందంట. ఈ విషయాన్ని చాలా సార్లు అయినా చెప్పుకు రావడం జరిగింది. మా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె సపోర్ట్ తో పాటు వ్యక్తిగతంగా తనకు అండగా నిలబడినట్లు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే ఇటీవల పవిత్ర లోకేష్… నరేష్ కలిసి పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. గుడివాడ వంటి చోట్ల కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది.
దీంతో ఆయన నాలుగో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మేము కలిసి జీవిస్తున్నాం పెళ్లయితే చేసుకోలేదని నరేష్ క్లారిటీ ఇచ్చాడు. గతంలో పవిత్ర లోకేష్ తో నరేష్ ఉంటున్న సమయంలో మూడో భార్య రమ్య రఘుపతి మైసూర్ హోటల్ లో గొడవ చేయడం తెలిసిందే. ఆ సమయంలో హోటల్ బయట బయట నుంచి మీడియా సమావేశం పెట్టి ఇద్దరిపై మండిపడింది. అదే సమయంలో రమ్య పై కూడా నరేష్ దారుణమైన ఆరోపణలు చేయడం జరిగింది. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం కొనసాగుతూ ఉంది. ఇద్దరూ పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
తాజాగా ఓ టెలివిజన్ షో కి వచ్చి.. రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా నటుడిగా నరేష్ 50 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. సన్మానించడం జరిగింది. ఇదిలా ఉంటే రమ్య రఘుపతి వద్ద ఉన్న తన కొడుకుకి భద్రత లేదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో పెళ్లయిన తర్వాత నుండి హ్యాపీగా లేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ నా కొడుకు ఆమె దగ్గరుంటే భవిష్యత్తు ఉండదు అంటూ నరేష్ ఎంతో ఆవేదన చెందారు.