నర్సాపూర్ మండల కేంద్రంలోనీ బోయవాడ వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నరేందర్ బర్కుంట మాట్లాడుతూ భారత దేశం మొత్తానికి 1947ఆగస్ట్ 15నాడు స్వాతంత్య్రం వస్తే, కాశ్మీర్, జుణాగడ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం ఆలస్యంగా విలీనం అయ్యాయి. నిజాం సంస్థానం మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆపరేషన్ పోలో ద్వారా 13నెలల తర్వాత అంటే 1948సెప్టెంబర్ 17 నాడు భారత్ లో విలీనం అయ్యాయి అని అన్నారు… ఈ కార్యక్రమం లో బూత్ అద్యక్షులు కండేల శివ, మండల ఉపాధ్యక్షుడు దుసముడి సవీన్, పల్లపు రాజు, పర్స మహేశ్, ప్రవీణ్, రవి, చందు, రాజు , లక్ష్మణ్ లు పాల్గొన్నారు.
[zombify_post]