in , , , , ,

32 పోలీస్ స్టేషన్లను గడగడలాడించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు

  • 32 పోలీస్ స్టేషన్ లను గడగడ లాడించిన తెలంగాణ సాయుధ పోరాట యోధులు కోట వెంకట్ రెడ్డి (కే వి )

సూర్యాపేట: చుట్టుముటు సూర్యాపేట నట్ట నడుమ  నల్లగొండ నువ్వు పోయేది హైదరాబాదు దాని పక్కన గోల్కొండ గోల్కొండ ఖిలా కింద గోరి కడతాం నా కొడుకు… నైజాం సర్కరోడా… అంటూనైజాం గుండెల్లోదడ పుట్టించి32పోలీస్ స్టేషన్ లను గడగడలాడించిన తెలంగాణ సాయుధ పోరాట యోధులు కోట వెంకట్ రెడ్డి .వీరి స్వగ్రామం ప్రస్తుత సూర్యాపేట జిల్లా మోతే మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన కోట వెంకట్ రెడ్డి వీరి తల్లిదండ్రులు కోట లచ్చిరెడ్డి, సీతారావమ్మ  వీరికి ఒక సోదరుడు కోట చిన సత్యనారాయణ రెడ్డి కోట వెంకట్ రెడ్డి సూర్యాపేట జెడ్పీ హైస్కూల్ నందు 1945 వ సంవత్సరంలో ఆరో తరగతి వరకు చదువుకున్నారు. 

రెడ్డి హాస్టల్ లో ఉంటూ చదువుకునేవారు. ఆ హాస్టల్లో మాజీ ఎంపీ తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మ బిక్షం తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ప్రతిరోజు సాయంత్రం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను ధర్మము, నీతి, న్యాయము పేదల సమస్యల గురించి ధర్మ దీక్షతో చర్చించేవారు. 

ఆ రోజుల్లో   దౌర్జన్యాలు చుట్టూ ముట్టు జాకీర్దారులు జమీందారుల అరాచకాలతో  ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆ రోజుల్లో సూర్యాపేట పట్టణంలోని ఉప్పుల రామ్మూర్తి కొట్టులో అనా పైసలు (6 పైసలు) పెట్టి మూడు యాక్సా బేళ్లను కొని సూర్యాపేట సభ్యుల్లో ఉండబడిన పందిరి లక్ష్మయ్య మరియు ఇంకా ఇద్దరు మనుషులను జైల్లో ఊచలు కోసి తప్పించారు కోట వెంకటరెడ్డి. ఆ తర్వాత ఆత్మకూరు (ఎస్ )మండలం కోటపాడు గ్రామంలో ఆరుగురు పోలీసులను హతమార్చినారు. దీని తర్వాత  అత్యాధునిక ఆయుధాల కొరకు 32 పోలీస్ స్టేషన్ ల లో బాంబులు వేసి ఆయుధాలను ఎత్తుకు వచ్చి పార్టీ కార్యకర్తలకుఇచ్చారు.

 గ్రైనేడ్లు విసరాండంలో దిట్టగా  కోట వెంక రెడ్డి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తుపాకిలో ఒక్క బుల్లెట్ ఉన్న గురి తప్పకుండా శత్రువులను చంపగలిగే నైపుణ్యం  వారికే సొంతం. దళం అనే దానిని మొట్టమొదటగా  నిర్మాణం చేసినది. కోట వెంకట్ రెడ్డి.1945 నుండి 52 వరకు ఎత్తిన తుపాకీ దించకుండా నైజాం నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి కోట వెంకటరెడ్డి. ఆయన ఉద్యమ ప్రస్థానంలో నల్గొండ ఖమ్మం వరంగల్  కరీంనగర్ ఆదిలాబాద్ కృష్ణ జిల్లాలో పనిచేశారు. 

మోతే మండలం బురకచర్ల గ్రామంలో కోవర్టు చేసిన మోసం మూలంగా  సిరికొండ క్యాంపు నుండి 100 మంది మిలటరీ వచ్చి కాల్పులు జరపడం జరిగింది. ఎంతమంది కాల్పులు చేసినప్పటికీ చాకచక్యంతో  తప్పించుకున్నారు.రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మ బిక్షం,భీమిరెడ్డి నరసింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు కోదాటి నారాయణరావు వంటి నాయకులతో కలిసి పని చేశారు. వీరి సహచరులు మద్ది కాయల ఓంకార్  నంద్యాల శ్రీనివాస్ రెడ్డి చల్ల సీతారాంరెడ్డి హరి బండి లక్ష్మీనారాయణ కొండవీటి గుర్నాథ్ రెడ్డి దొడ్డ నరసయ్య కోలూరు మోహన్ రావు పిండి పూలు వెంకటనారాయణ వంటి వారు వీరికి శిష్యులుగా ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అందరి బాధ్య‌త‌

“ఒకే దేశం…ఒకే ఎన్నికలు”