ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు గురు న్యూస్ :
క్రీడల వల్ల చురుకుదనం, శారీరక, జ్ఞాపకశక్తి, దారుఢ్యం, ఏకాగ్రత పెంపొందుతాయి: షహనాజ్ బేగం
వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా – పోటీలను షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులని ఉద్దేశించి షహనాజ్ బేగం మాట్లాడుతూ
విద్యార్థిని విద్యార్థులు ఆటలు ఆడటం వల్ల పిల్లల శరీరానికి వ్యాయామం లభిస్తుందని . వారిలో చురుకుదనం, శారీరక, జ్ఞాపకశక్తి, దారుఢ్యం, ఏకాగ్రత కూడా పెంపొందుతాయి. నీరెండలో ఆడటం వల్ల శరీరానికి విటమిన్ డి కూడా లభిస్తుందని ఆమె తెలిపారు.
ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచినవారిని ప్రోత్సహించాలి. విధ్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఆటల ద్వారా చైతన్యవంతం చేస్తే వారు క్రమశిక్షణగల ఉత్తమ పౌరులుగా ఎదుగుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని అన్నారు.
మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో ఆడతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు,స్కూల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]