చీపురుపల్లి, గరివిడి, : ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని, రాజమహేంద్రవరం జైలులో ఆయన భద్రతపై ప్రజల్లో అనుమానాలు
రేకెత్తుతున్నాయని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో మెరకముడిదాం మండల నాయకులతో కలిసి దీక్ష చేపట్టారు. జగన్ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాజమహేంద్రవరం జైలులో కరుడుగట్టిన నేరస్థులున్నారని, రాష్ట్ర చరిత్రలో ఎన్నో రాజకీయ హత్యలు జైలులోనే జరిగాయన్నారు. అనంతరం గరివిడి జామియా మసీదులో నాయకులతో కలిసి ప్రార్థనలు చేశారు.
[zombify_post]