తమను ఒప్పంద ఉద్యోగులుగా పరిగణించాలని విజయనగరంలోని జేఎన్టీయూ గురజాడ ఇంజినీరింగ్ కళాశాల పొరుగుసేవల సిబ్బంది కోరారు. కళాశాల ప్రారంభం నుంచి పని చేస్తున్నామని, చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామన్నారు. 2022లో విశ్వవిద్యాలయంగా మార్పు చేసినా, తమకు న్యాయం జరగలేదన్నారు. కనీస వేతన స్కేలు అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రికి వినతిని అందజేసేందుకు వచ్చారు. అనుమతించకపోవడంతో అక్కడున్న వైకాపా నేతలకు పత్రాలు అందజేసి వెనుదిరిగారు.
[zombify_post]